KDP: గండికోటలో ఆదివారం నుంచి మూడు రోజులపాటు జరిగే ఉత్సవాల ఆర్టీసీ ద్వారా ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని ఆర్ఎం పి. గోపాల్‌రెడ్డి తెలిపారు. మొత్తం 39 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. జమ్మలమడుగులో ఉదయం నుంచి ప్రతి 15 నిమిషాలకు ఒకటి రాత్రి 10 గంటల వరకు నిరంతరాయంగా బస్సులు నడుస్తాయన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.