TPT: జీవనోపాధికోసం కువైట్ వెళ్లిన శ్రీకాళహస్తికి చెందిన ఓ మహిళ అక్కడ తాను తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు పేర్కొంది. శ్రీకాళహస్తి రాజనగర్కు చెందిన ఓ మహిళ బ్రతుకుదెరువుకోసం కువైట్ వెళ్లింది. అక్కడ ఇంటి యజమాని తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాడని, 24 గంటలు పనిచేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే తనను ఆదుకోవాలని వేడుకుంది.