KRNL: పెద్దకడబూరు మండలంలోని చిన్నతుంబళంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సహకారంతో జిల్లాస్థాయి కబడ్డీ పోటీలను వైసీపీ నాయకులు పురుషోత్తం రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, కేపీ యల్లప్ప మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో మెలగాలని, గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని కోరారు.