ప్రకాశం: ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి ఇవాళ ఒంగోలుకు రానున్నట్లు ఎంపీ మాగుంట కార్యాలయ ప్రతినిధి వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. తన పుట్టినరోజు సందర్భంగా ఎంపీ మాగుంట కార్యాలయం వద్ద జరిగే ప్రత్యేక కార్యక్రమాల్లో ఎంపీ పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమాలలో పార్టీ అభిమానులు, కార్యకర్తలు నాయకులు, పాల్గొనాలని కోరారు.