నెల్లూరు నగరపాలక సంస్థలో ముందస్తు క్రిస్మస్ వేడుకలను మేయర్ స్రవంతి, కమిషనర్ సూర్య తేజల సహకారంతో శనివారం అత్యంత వేడుకగా నిర్వహించారు. ఈ వేడుకలలో అదనపు కమిషనర్ నందన్ హాజరై ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ కార్యాలయ ప్రాంగణంలో దేదీప్యమైన విద్యుత్ కాంతుల నడుమ క్రీస్తు జననానికి సంబందించిన ముఖ్య ఘట్టాలను వివరించారు.