BPT: వాడరేవు గ్రామానికి చెందిన బాలుడు కనిపించకపోవడంతో తండ్రి నూకరాజు గత సోమవారం ఎస్పీ పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రెండు బృందాలుగా గాలింపు చేపట్టి బాలుడిని కాకినాడలో గుర్తించారు. అనంతరం చీరాల రూరల్ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.