NRPT: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఈనెల 14న మరికల్ మండల కేంద్రంలో అంబేద్కర్ శోభాయాత్ర జరగనుంది. దీంతో ఇవాళ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను గ్రామ సర్పంచ్ చెన్నయ్య ఆవిష్కరించారు. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులతో పాటు అంబేద్కర్ సంఘం సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు సూచించారు.