సత్యసాయి: సోమందేపల్లి మండలంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా శనివారం టీడీపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఎంపీడీవో వెంకటలక్ష్మమ్మ మాట్లాడుతూ.. టంగుటూరి ప్రకాశం పంతులు నిరుపేద కుటుంబంలో పుట్టి, చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకున్నారని తెలిపారు.