ATP: జిల్లాలో గత మూడు రోజులుగా కురిసిన వర్షం తగ్గుముఖం పట్టింది. దీంతో పంట దిగుబడులు పెరుగుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. శనివారంన కుందుర్పిలో 10.6 మి.మీ, ఆత్మకూరు 7.0, కూదేరు 4.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని జిల్లా అధికారులు తెలిపారు. మరోవైపు మొక్కజొన్న పంట కోతకు రైతులు సిద్ధమవుతున్నారు.