కోనసీమ: మామిడికుదురు మగటపల్లి గ్రామంలోని సమస్యలను పరిష్కరించాలని స్థానికులు అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్‌కు వినతిపత్రం ఇచ్చారు. అమలాపురం ఎంపీ క్యాంప్ ఆఫీసులో మంగళవారం కలిసి మగటపల్లి గ్రామంలో ఉన్న సమస్యలను వివరించారు. సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరారు. పి.గన్నవరం నియోజకవర్గం టీడీపీ కన్వీనర్ నామన రాంబాబు తదితరులు పాల్గొన్నారు.