కృష్ణా: ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గిరీషా ఆదేశాల మేరకు విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో రాష్ట్ర పురుషుల, మహిళల వాలీబాల్ జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి అజీజ్ తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు 27వ తేదీన ఉదయం స్టేడియంలో గల మైదానానికి ఆధార్ కార్డ్, నేటివిటీ సర్టిఫికెట్, పాస్పోర్ట్ తీసుకురావాలని కోరారు.