NLR: చేజర్ల మండలం పెరుమాళ్లపాడులో ఆదివారం ‘మీ భూమి మీ హక్కు – రాజముద్ర’ పథకం కింద పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు పాస్‌బుక్‌లను అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. రైతుల భూమి హక్కులకు పూర్తి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.