అన్నమయ్య: బస్సులను రోడ్డుపైకి తీసుకువెళ్లి ప్రతిరోజు కండిషన్ చెక్ చేయాలని మెకానిక్, డ్రైవర్లకు మదనపల్లె ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకటరమణారెడ్డి సూచించారు. బుధవారం బస్సుల కండిషన్లపై వారిని ఆరా తీసి బస్సులను పరిశీలించారు. అందులో భాగంగా స్టీరింగ్, బ్రేక్, బ్యాటరీ, ఎలక్ట్రికల్ వైరింగ్లను పరిశీలించినట్లు పేర్కొన్నారు.