ATP: నారాయణపురం పంచాయతీకి చెందిన జనసేన క్రియాశీలక కార్యకర్త మోపిశెట్టి పవన్ కుమార్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల సహాయ నిధిని అందజేశారు. జిల్లా జనసేన అధ్యక్షుడు టీసీ వరుణ్ మృతుడి కుటుంబసభ్యులకు ఆ చెక్కును అందజేసి, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.