NDL: ప్రపంచ క్రికెట్ మహిళా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఇండియా విజయం సాధించాలని ఇవాళ పగిడ్యాల మండలం, తూర్పు ప్రాతకోట గ్రామంలో శ్రీ నాగేశ్వర స్వామికి టీడీపీ కన్వీనర్ పలుచాని మహేశ్వర రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా స్వామి వారిని దర్శించుకుని, కొబ్బరి కాయలు కొట్టి మొక్కలు తీర్చుకొని, స్వామి వారి తీర్థ ప్రసాదం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల, జిల్లా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.