పల్నాడు: ఈపూరు మండలంలో ఒంటరి మహిళను లక్ష్యంగా చేసుకుని బంగారు ఆభరణాలు చోరీకి పాల్పడిన యువకుడిని ఎస్సై ఉమామహేశ్వరరావు శనివారం అరెస్ట్ చేశారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ఈపూరుకు చెందిన గుంటకుల పేరమ్మ తన ఇంట్లో టీవీ రావడం లేదని కేబుల్ ఆపరేటర్ సాయిరాంకు తెలిపింది. డిసెంబర్ 24న కేబుల్ వైర్లు బాగుచేసినట్లు చేసి మహిళ మెడలో బంగారు గొలుసు లాక్కెళ్లాడు.