NDL: బీసీ కార్పొరేషన్ కింద 50% సబ్సిడీతో అందించే రుణాల మంజూరుకు ప్రభుత్వం మరోసారి దరఖాస్తు గడువు పొడిగించినట్లు సంజామల ఎంపీడీవో సాల్మన్ తెలిపారు. ఇవాల్టితో గడువు ముగుస్తుండగా.. ప్రభుత్వం ఈనెల 15 వరకు పొడిగించిందన్నారు. 21 నుంచి 60 ఏళ్లలోపు వారు అర్హులన్నారు. BC(A)-23, BC(B)-14, BC(D)-7, BC(E)-11, EBC-4 ఉన్నట్లు వెల్లడించారు.