KDP: ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని టీడీపీ పులివెందుల నియోజకవర్గపు ఇంఛార్జ్ బీటెక్ రవి పేర్కొన్నారు. శుక్రవారం పులివెందుల కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌కు పలు గ్రామాల ప్రజలు హాజరయ్యారు. బీటెక్ రవి వారి సమస్యల వినతులను స్వీకరించారు. ప్రజలు సమర్పించిన అర్జీలను పరిశీలించి, సమస్యలకు పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.