VZM: స్త్రీ శక్తి పథకం కింద కూటమి ప్రబుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సరైన పద్ధతిలో అమలు చేయడం లేదని ZP ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. శనివారం బొబ్బిలిలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. APS RTCలో 14 రకాల సర్వీసులలో ఐదు మాత్రమే పరిమితం చేశారని, బస్సు ఎక్కిన మహిళలను గందరగేళానికి గురి చేస్తున్నారని ఆయన ఆక్షేపించారు.