KDP: విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఓటు చోరీ సంతకాల సేకరణలో కడప జిల్లా 1,70,000 సంతకాల సేకరించి రాష్ట్రంలో మొదటి స్థానం నిలిచిందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎన్.డి విజయ జ్యోతి తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి అభినందించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు.