NLR: సమాజ శ్రేయస్సుకు కిశోరి బాలికల వికాసం అత్యంత ఆవశ్యమని జిల్లా రెవెన్యూ అధికారి ఉదయ భాస్కరరావు అన్నారు. బుధవారం నెల్లూరు కలెక్టరేట్లో తిక్కన ప్రాంగణంలో కిశోరి బాలికల వికాసం జిల్లాస్థాయి శిక్షకుల శిక్షణా కార్యక్రమాన్ని ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆడపిల్లలకు 11 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్య వయసు అత్యంత విలువైనదన్నారు.