కడప జిల్లా పోలీస్ కార్యాలయ ఏవో కే. వీ. రమణ (56) సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన భౌతిక కాయానికి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, అదనపు ఎస్పీ రమణయ్య, డీఎస్పీలు, ఇతర సిబ్బంది పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎస్పీ బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.