PLD: చిలకలూరిపేట నుంచి గుంటూరు వెళ్తున్న బొలెరో వాహనం ప్రమాదానికి గురైంది. ఓబులనాయుడుపాలెం వద్ద ఆదివారం సాయంత్రం బొలెరో అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో పేట సుభాని నగర్‌కు చెందిన ఎస్కే కరిముల్లా(42) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో వాహనంలోనే ఉన్న ఆయన భార్య సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.