GNTR: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాకుమాను మండలం కె.బి పాలెంలో మంగళవారం రచ్చబండ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు వైసీపీ సమన్వయకర్త బలసాని కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ప్రైవేట్ కళాశాలల వల్ల పేద విద్యార్థుల భవిష్యత్తుకి నష్టం వాటిల్లుతుందని ఆయన మండిపడ్డారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.