SKLM: టెక్కలి కోర్టులో మార్చి 8న జరగనున్న “జాతీయ లోక్ అదాలత్”ను సద్వినియోగం చేసుకొని ఎక్కువ కేసులు రాజీకి అందరూ సహకరించాలని టెక్కలి కోర్టు సివిల్ జడ్జి ఎమ్.రోషిణి కోరారు. టెక్కలి కోర్టుల పరిధిలోని న్యాయవాదులు, పోలీసు అధికారులుతో కోర్టు హాల్లో ఆమె వేరువేరుగా జాతీయ లోక్అదాలత్ పై బుధవారం సమీక్ష సమావేశాలు నిర్వహించారు.