W.G: తూర్పు పశ్చిమగోదావరి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును సోమవారం మర్యాదపూర్వక కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గోపి మూర్తిని అభినందించారు. అనంతరం ఉపాధ్యాయ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.