SKLM: ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం మంగళవారం చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ పరీక్షలో ప్రతి పాఠశాల నుంచి 8, 9, 10 తరగతులలో, పాఠశాల స్థాయి టాలెంట్ టెస్ట్‌లో ప్రధమ స్థానంలో నిలిచిన ముగ్గురు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక రోటరీ, లయన్స్ క్లబ్ ప్రతినిధులు నిర్వహించారు.