అన్నమయ్య: తంబళ్లపల్లె ఎస్ఐ అనిల్ సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సిబ్బందితో కలిసి తంబళ్లపల్లె రాగిమానుకూడలి ప్రాంతంలో సైబర్ నేరాలు, బెట్టింగ్, రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించారు. గుర్తు తెలియని మెసేజ్లను క్లిక్ చేస్తే అకౌంట్లు ఖాళీ కావచ్చని హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వమని సూచించారు.