VZM: నెల్లిమర్ల పట్టణంలోని సీకేఎం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నెల 22వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రశాంత్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ, ప్రభుత్వ జూనియర్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.