VZM: శృంగవరపుకోట నియోజకవర్గంలో 18 రోజుల్లోనే 20 వేల టీడీపీ సభ్యత్వాలు విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తెలిపారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు, సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నియోజకవర్గంలో వివిధ హోదాల్లో గల నాయకులు, కార్యకర్తల సహకారంలో సభ్యత్వ నమోదు నిర్వహించామన్నారు.