TTD : టీటీడీ 2023-24 వార్షిక బడ్జెట్ ఎంతో తెలుసా…!
టీటీడీ (TTD) 2023- 24 ఆర్థిక సంవత్సరానికి రూ 4,411.68 కోట్ల బడ్జెట్‌ను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) ఆమోదించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ (Budget) ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసిందని ఆయన తెలిపారు. హుండీ ద్వారా 1,591 కోట్ల రూపాయలు ఆదాయం వస్తాయని అంచనా వేశారు. పెట్టుబడుల ద్వారా వడ్డీ రూ.990 కోట్లు, ప్రసాదాలు విక్రయం ద్వారా రూ.500 కోట్లు, ప్రత్యేక దర్శనాల ద్వారా రూ.330 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా అని వెల్లడించారు.
టీటీడీ (TTD) 2023- 24 ఆర్థిక సంవత్సరానికి రూ 4,411.68 కోట్ల బడ్జెట్‌ను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) ఆమోదించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ (Budget) ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసిందని ఆయన తెలిపారు. హుండీ ద్వారా 1,591 కోట్ల రూపాయలు ఆదాయం వస్తాయని అంచనా వేశారు. పెట్టుబడుల ద్వారా వడ్డీ రూ.990 కోట్లు, ప్రసాదాలు విక్రయం ద్వారా రూ.500 కోట్లు, ప్రత్యేక దర్శనాల ద్వారా రూ.330 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా అని వెల్లడించారు. ఆర్జిత సేవల ద్వారా రూ.140 కోట్లు, అద్దె గదులు, కళ్యాణ మండపాల ద్వారా రూ.129 కోట్లు, తలనీలాల విక్రయం (Sale of headscarves) ద్వారా126.50 కోట్లు వస్తాయని అంచనా వేశారు. తిరుమల అన్నామయ్య భవనంలో(Annamayya building) ఈవో ఏవీ ధర్మారెడ్డితో కలిసి ఆయన మీడియ సమావేశం నిర్వహించారు.
24 బడ్జెట్ ఆమోదంతో పాటు కొన్ని పరిపాలనా పరమైన నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగిందని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ (MLC Election Code) అమలులో ఉన్నందువల్ల ఆ వివరాలను వెల్లడించలేక పోయామన్నారు. వీఐపీ బ్రేక్ (VIP Break) దర్శనం సమయం మార్చినందువల్ల సామాన్య భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని, ఈ విధానాన్ని కొనసాగిస్తామని చెప్పారు.‘కోవిడ్ తరువాత హుండీ ఆదాయం గణనీయంగా పెరిగింది. కోవిడ్‌కు ముందు ఏడాదికి రూ.1200 కోట్లు కానుకలు లభించేవి. కోవిడ్ తరువాత హుండీ ఆదాయం రూ.1500 కోట్ల దాకా పెరిగింది. బ్యాంకుల్లో ఉన్న టీటీడీ డిపాజిట్ల (TTD Deposits) మీద కూడా వడ్డీ రేట్లు పెరిగాయి. భక్తుల కోరిక మేరకు కోవిడ్ సమయంలో వర్చువల్ సేవా టికెట్లు ఆన్ లైన్లో జారీ చేశాం. తరువాత కూడా భక్తుల కోరిక మేరకు ఈ సేవలు కొనసాగించాలని నిర్ణయించాం.
తిరుపతిలో (Tirupati) నిర్మిస్తున్న శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ నిర్మాణం ఏప్రిల్ ఆఖరు నాటికి పూర్తి చేయించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS jagan) చేతుల మీదుగా ప్రారంభిస్తాం. అలిపిరి నుండి వకుళామాత ఆలయం వరకు కొత్తగా రోడ్డు మంజూరు చేశాం.’ అని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.తమిళనాడు రాష్ట్రం ఊలందూరు పేటలో దాత విరాళంతో నిర్మిస్తున్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో రూ 4.70 కోట్లతో కొన్ని అభివృద్ధి పనులు చేపట్టడానికి నిర్ణయించామని టీటీడీ ఛైర్మన్ తెలిపారు. తిరుప ఎస్జిఎస్ ఆర్ట్స్ కళాశాల పడమరవైపు మూడో అంతస్తు నిర్మాణం, ల్యాబ్ ఆధునీకరణ, గ్రంథాలయం, ఇండోర్ గేమ్స్ భవనాల నిర్మాణం తదితర పనుల కోసం రూ. 4.71 కోట్లతో టెండర్లు ఖరారు(Tenders are finalised) చేశాం. శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్లో పని చేస్తున్న సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులతో కలిపి దర్శన వసతి, రాయితీపై రూ 20 చొప్పున నెలకు 10 లడ్డూలు అందించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది.’ అని వైవీ సుబ్బారెడ్డి(YV Subbareddy) తెలిపారు.