ATP: అనంతపురం జిల్లా వ్యవసాయ శాఖ జేడీఏగా నియమితులైన రవికుమార్, శ్రీ సత్యసాయి జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈగా నియమితులైన మోసెస్ను ఎమ్మెల్యే పరిటాల సునీత వెంకటాపురం నివాసంలో గౌరవపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రైతులకు సంబంధించిన సమస్యలు, అవసరాలపై వెంటనే స్పందించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. జిల్లాలో రైతులకు మెరుగైన సేవలు అందించాలని ఆమె కోరారు.