E.G: వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు శుక్రవారం తాడేపల్లిలో మర్యాదపూర్వకంగా కలిశారు. నిడదవోలు, కొవ్వూరు నియోజకవర్గాల పరిశీలకుడిగా తనను నియమించినందుకు ఆయన జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లి, ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని బాబుకు జగన్ సూచించారు.