సీఎం జగన్ తో పెట్టుకుంటే వాళ్లంతా రాజకీయ సన్యాసం తీసుకున్నారని… ఆయనకు ద్రోహం చేస్తే పుట్టగతులు ఉండవంటూ.. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన చిత్తూరు జిల్లాలో గడపగడపకీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇలాంటి కామెంట్స్ చేశారు.
వైసీపీలో ఉంటూనే.. జగన్ కి కొందరు ద్రోహం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. జగన్ కి ద్రోహం చేస్తే పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. అలా ద్రోహం చేయాలని ప్రయత్నించి.. సోనియా గాంధీ, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబునాయుడు, ఎర్రన్నాయుడు వంటి బడా కుటుంబాలే అడ్రస్ లేకుండా పోయాయని ఆయన అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సింహం లాంటివారని.. అందరూ మందలు మందలుగా వచ్చినా, ఆయనను ఏం చేయలేరని చురకలంటించారు.