TPT: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి కడపకు చెందిన డాక్టర్ రామస్వామి ఏలుమలై రెడ్డి దంపతులు బంగారు గజ్జలను కానుకగా అందజేశారు. అమ్మవారికి అలంకరించడానికి వీలుగా 120 గ్రాములు బంగారంతో రూ. 10 లక్షలు విలువైన రెండు గజ్జలను తయారు చేయించారు. ఆలయంలో గజ్జలను ఏఈఓ దేవరాజులు, ఆర్జితం ఇన్స్పెక్టర్ చలపతికి దాత కుటుంబ సభ్యులు అందజేశారు.