VZM: స్వచ్ఛ సుందర పార్వతీపురం లక్ష్యంగా కృషి చేయాలని జిల్లా పంచాయతీ అధికారి టి.కొండలరావు అన్నారు. గురువారం జియ్యంవలస మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు స్వచ్ఛ సుందర పార్వతీపురంపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పార్వతీపురం మన్యం జిల్లాను స్వచ్ఛ సుందర పార్వతీపురం జిల్లాగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.