ప్రకాశం జిల్లా దోర్నాల మండలం బొమ్మలాపురం సమీపంలోని అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరించినట్లు వీడియోలు సోషల్ మీడియాలో ఆదివారం వైరల్ అయ్యాయి. స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా, అధికారులు పులి పాదముద్రలను గుర్తించారు. ఈ ప్రాంతంలో ఒంటరిగా రావొద్దని, పులి సంచారాన్ని గుర్తించడానికి ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.