గుంటూరు: విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని పెదనందిపాడు తహశీల్దార్ శంకర్ బాబు చెప్పారు. శనివారం పెదనందిపాడు జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాలను సద్వినియోగం చేసుకొని ఉన్నతంగా చదువుకొని మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాలన్నారు.