VSP: విశాఖ నగరం కనకమహాలక్ష్మీ ఆలయంలో ప్రారంభమైన మార్గశిర మాసోత్సవాల ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ సోమవారం పరిశీలించారు. ఆలయానికి విచ్చేసిన ఆయన ఏర్పాట్ల గురించి ఈవో శోభారాణిని అడిగి తెలుసుకున్నారు. క్యూలైన్స్ మధ్య ఎమర్జెన్సీ గేట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని మార్గాల వద్ద సూచన బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.