TPT: నాయుడుపేటలోని గాంధీ మందిరం వద్ద మైనకూరు, వెంకటగిరి వైపు వెళ్లే ప్రయాణికుల కోసం నిర్మించిన బస్ షెల్టర్‌ను సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ శనివారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రయాణికుల సౌకర్యార్థం బస్ షెల్టర్ నిర్మించడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ రఫీ, మాజీ ఎఎంసీ ఛైర్మన్ విజయభాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.