గుంటూరు జిల్లా కాకుమానులో శనివారం జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు. జిల్లాలోని 2,56,904 మందికి గానూ రూ.111.34 కోట్లు అందజేశారు. దీనితోపాటు తుఫాన్ బాధితులకు ఒక్కొక్కరికి రూ.3 వేల ఆర్థిక సహాయం కూడా అందించారు.