CTR: పుంగనూరు పట్టణం సమీపాన దూల్లవారి ఇండ్ల వద్ద కొలువైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో మండల పూజలు వైభవంగా ముగిసాయి. సోమవారం వేద పండితులు హోమాది కార్యక్రమాలు నిర్వహించారు. తర్వాత అమ్మవారి విగ్రహాన్ని అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు అమ్మవారి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.