VSP: మార్చి 1 నుంచి మంగళవారం వరకు కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులపై ప్రత్యేక తనిఖీ డ్రైవ్ నిర్వహించినట్టు విశాఖ రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో మొత్తం 8 కేసులు నమోదు చేసి రూ. 6.35 లక్షల చలానాలు విధించారు. అనుమతులు లేకుండా నడపడం, పర్మిట్ నిబంధనలు ఉల్లంఘించడం, పన్నులు చెల్లించకపోవడం, తదితర మోటారు వాహన చట్ట ఉల్లంఘనలపై కేసులు నమోదు చేసామన్నారు.