సత్యసాయి: పెనుకొండ మండలంలోని బాలుర కళాశాల హాస్టల్లో మధ్యాహ్న భోజనాన్ని ఏఐఎస్ఏ నాయకులు సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఏ నాయకులు పునీత్, గణేష్ విద్యార్థులతో మెనూ ప్రకారం భోజనం వడ్డిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. హాస్టల్లో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తామని విద్యార్థులకు తెలిపారు.