కృష్ణ: నాలుగు సంవత్సరాలుగా నూజివీడు డిపో విస్సన్నపేట నుంచి రెడ్డి గూడెం, మైలవరం మీదుగా నడిచే బస్సులు రద్దు చేయటంతో ప్రయాణీకులు తీవ్ర అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు. విస్సన్నపేట నుంచి మైలవరంకు ఉదయం 9, 10 గంటలకు, సాయంత్రం 4, 5 గంటల తరువాత కేవలం విజయవాడ డిపో సర్వీసులు మాత్రమే నడుపుతుండడంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.