KRNL: తెలుగుదేశం పార్టీ MPTC సభ్యుడు, ఉల్చాల గ్రామానికి చెందిన బోయ శివన్న మృతి పట్ల టీడీపీ సీనియర్ నేత, కేడీసీసీబీ ఛైర్మన్ డి. విష్ణువర్ధన్ రెడ్డి సంతాపం తెలిపారు. పార్టీ ఆరంభం నుంచి శివన్నకు అతినమ్మకస్థుడుగా, కీలక పాత్ర పోషించారని తెలిపారు. శివన్న మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం, కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.