ATP: తాడిపత్రి మండల ఆదర్శ పాఠశాల విద్యార్థినులు జ్యోతి, హబీబా, జయశాలినీ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికయ్యారు. అనంతపురంలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో అద్భుత ప్రతిభ చూపి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించారు. ఈ నెల 24 నుంచి 26 వరకు గుడివాడలో నిర్వహించే పోటీల్లో ప్రతిభ చాటేందుకు సిద్ధమయ్యారని ప్రిన్సిపల్ లావణ్య తెలిపారు.