KRNL: విజయవాడలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ను ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో ఆలూరు నియోజకవర్గానికి సంబంధించిన విద్యుత్ సమస్యలు, మౌలిక వసతుల అభివృద్ధి, భవిష్యత్ ప్రాజెక్టులపై చర్చించినట్లు తెలిపారు. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో నిరంతర విద్యుత్ సరఫరా వంటి అంశాలను చర్చించామన్నారు.