సత్యసాయి: మడకశిర వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు శేషాద్రి రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. పేద విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తెచ్చిన వైఎస్ జగన్ సంకల్పాన్ని కూటమి ప్రభుత్వం వ్యాపార ప్రయోజనాల కోసం దెబ్బతీస్తోందని విమర్శించారు. ఈ నిర్ణయం వైద్య విద్యను వ్యాపారంగా మార్చే చర్యగా ఆయన అభిప్రాయపడ్డారు.