ప్రకాశం: పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును ఆయన క్యాంపు కార్యాలయంలో ఆదివారం నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అర్జీలు సమర్పించారు. ఎమ్మెల్యే ఏలూరి అర్జీలు తీసుకొని వారి సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.